Temple Logo

మెను

+91-7788999942
isukadarsisivalayam9@gmail.com

దేవాలయ చరిత్ర, విశిష్టత

Temple 1

ఓం నమః శివాయ

గుడి చరిత్ర

వేద పండితులు, అమ్మవారి ఉపాసకులు, పురోహితులు అయిన కీ||శే|| బ్రహ్మశ్రీ గుడిమెళ్ళ సుబ్బరామయ్య గారు వారి స్వగ్రామం గుంటుపల్లి నుండి పరిసర గ్రామాల్లో పురోహిత కార్యక్రమాలకు కాలినడకన నడిచివెళ్ళేవారు.

ఆ క్రమంలో ఇసుక దర్శి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న కొణిదెన గ్రామంలో కూడా పూజలకు వెళ్ళేవారు అలా వెళ్ళినప్పుడు ఆ గ్రామ శివార్లలో 1980-1985 మధ్య కాలం లో బ్రహ్మ సూత్రం కలిగిన గొప్ప శివలింగం ఆయనకు లభించింది.

ఇసుకదర్శి గ్రామ పురోహితులు అయిన సుబ్బరామయ్య గారు గ్రామం లో శివాలయం లేని కారణంగా ఈ స్వామివారిని కొంతమంది గ్రామస్తుల సహాయంతో ఇసుకదర్శి గ్రామానికి చేర్చడం జరిగింది.

అప్పటి నుండి గ్రామంలోని భక్తులు స్వామి వారికి చాలా భక్తిగా పూజాదికములు నిర్వహించేవారు.

కొన్ని అనివార్య కారణముల వలన స్వామి వారు గ్రామం లోని రెండు చోట్ల స్థానచలనం జరిగింది.

సుబ్బరామయ్య గారు కాలం చేసిన తరవాత వారి మనువడు అయిన కీ||శే|| శ్రీ గుడిమెళ్ళ వెంకట సుబ్రహ్మణ్య కోటేశ్వర శర్మ గారు స్వామి వారి దేవాలయ ధర్మకర్త గా వ్యవహరించారు. వీరి ధర్మకర్త గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది.

2005 లో గ్రామానికి తూర్పువైపు శ్రీ రోళ్ల రామారావు గారు స్వామి వారికి 2 సెంట్లు స్థలమును ఉచితముగా అందించారు. వారు అందించిన స్తలం లో చిన్న రేకుల కప్పు కలిగిన ఆలయమును నిర్మించడం జరిగింది.

దానినీ 2016 లో మరమ్మతులు నిర్వహించి వినాయకుడు, సుబ్రహ్మణ్య, నాగ దేవత, ఆంజనేయ, కాల భైరవ స్వామి వార్లను వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది.

అప్పటినుంచి దేవాలయానికి భక్తుల సంఖ్య బాగా పెరిగింది.

అందులో భాగంగా నూతన దేవాలయం శాస్త్రోక్తంగా నిర్మించి స్వామివారిని ఆ దేవాలయంలో ప్రతిష్టించాలి అనే ఉద్దేశంతో గ్రామంలో స్వామివారి దేవాలయానికి స్థలం పరిశీలించడం మొదలు పెట్టడం జరిగింది. స్తలం ఎక్కడా లభించలేదు.

వారు 2021 లో కాలం చేసిన తరువాత వారి రెండవ కుమారుడు అయిన గుడిమెళ్ళ నాగ శంకర్ గారు ఈ దేవాలయం నిర్వహణ, అర్చక బాధ్యతలు స్వీకరించారు.

2021 ఫిబ్రవరి 12 తేదీన గుడిమెళ్ళ నాగ శంకర్ గారు దేవాలయ అభివృద్ధి, నిర్వహణ, నిర్మాణ బాధ్యతలను నిర్వహించుటకు ట్రస్టుగా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ నెంబర్.38/2021.